కోనసీమ మత్స్యకారుల బోటు గల్లంతు.. చేపల వేటకు వెళ్లి తిరిగి రాని 8 మంది!
భారతదేశం, ఆగస్టు 17 -- డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చేపల వేటకు వెళ్లి తిరిగి రాని బోటు వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. అల్లవరం మండలం పరిధిలోని ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుండి సముద్రంలోకి వెళ్లిన బోటు, దానిలోని మత్స్యకారుల ఆచూకీ లభించకపోవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సముద్రంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
అల్లవరం మండలం ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్కు చెందిన IND-AP-E8-MO-135 నెంబర్ గల మెకనైజ్డ్ బోటు ద్వారా 8 మంది మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. నిబంధనల ప్రకారం వేట పూర్తి చేసుకుని తీరానికి చేరుకోవాల్సి ఉండగా.. నిర్దేశిత సమయం దాటినా బోటు తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది అధికారులను ఆశ్రయించారు.
గల్లంతైన బోటును IND-AP-E8-MO-135 న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.