Telangana,delhi, ఆగస్టు 13 -- సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండ రామ్, అమీర్ అలీఖాన్ నియామకాలను నిలిపివేస్తూ స్టే విధించింది.తదుపరి విచారణను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది.

దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను నాటి గవర్నర్ తమిళసై తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఆపై కోదండరామ్, అలీఖాన్ పేర్లను కేబినెట్ ప్రతిపాదించగా.. గవర్నర్ ఆమోదముద్ర వేశారు. వీరితో ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించారు.

అయితే తమ అభ్యర్థిత్వాలను తిరస్కరించటాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ముందుగా హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసుపై పలుమార్లు విచారించిన న్యాయస్థానం.. వారి నియామకాలను నిలిపివేస్తూ ఇవాళ తీర్పును ప్రకటించింది. సెప్టెంబర్ 17వ తేదీన తుది తీర్పు రానుంది...