భారతదేశం, ఆగస్టు 9 -- ఈ పాట వినగానే ఒక ప్రశ్న మాత్రం వెంటాడుతుంది. అసలు లచ్చమ్మ ఏ ఊరి మనిషి? ఒక కోడి పోయిందని బాధపడిన లచ్చమ్మ తన గోడును ఎవరికీ చెప్పుకుంది? ఎలా చెప్పుకుంది? ఆ మాట ఎవరినుంచి ఎవరికి చేరింది? చివరకు పాటగా మారి తెలంగాణ అంతటా ఎలా మారుమోగింది?

సోషల్‌ మీడియా లేదు. టీవీ చానళ్లు లేవు. చివరికి ఊరూరికీ వార్త తీసుకెళ్లే మీడియా కూడా లేదు. అయినా లచ్చమ్మ కోడి కథ మాత్రం తరతరాలుగా ప్రజల నోట నిలిచిపోయింది.

నిజానికి తెలంగాణ బతుకులో కోడికి ఉన్న స్థానం చిన్నది కాదు. ఇంటి పెరట్లో తిరిగే కోడి నుంచి బోనాల మొక్కులోని కోడి పుంజు వరకు... తెలంగాణ సంస్కృతిలో అది ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉంటుంది. బోనాల సందర్భంగా కోడి పుంజులను మొక్కుగా సమర్పించే ఆనవాయితీ కూడా కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది.

కానీ కోడి అంటే కేవలం మొక్కు కాదు. కోడి చుట్టూ పుట్టిన కథలు,...