భారతదేశం, జూలై 27 -- Niharika NM On Quitting Content Creation: డిజిటల్ మీడియా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోషల్ మీడియా సెన్సేషన్ నిహారిక ఎన్ఎమ్ (Niharika NM) ఇప్పుడు వెండితెరపై వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. దక్షిణాది సినిమాల ద్వారా నటిగా మారిన ఈ ఇంటర్నెట్ స్టార్, త్వరలోనే బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.

నాని ప్యారడైజ్ విలన్ రాఘవ్ జుయల్‌తో కలిసి నిహారిక నటించిన హిందీ చిత్రం 'భాయ్ తేరా స్టార్ హై' (Bhai Tera Star Hai) జూలై 31న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల తమిళంలో ఆమె నటించిన 'ఇదయమ్ మురళి' చిత్రం మంచి విజయాన్ని సాధించగా, వరుస ప్రమోషన్లలో పాల్గొంటున్న నిహారిక తన సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు, నెలకు లక్షల్లో వచ్చే భారీ ఆదాయాన్ని వదులుకుని నటన వ...