భారతదేశం, సెప్టెంబర్ 10 -- హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరోసారి రికార్డు స్థాయి ధరలు నమోదయ్యాయి. నగరంలోని అత్యంత విలాసవంతమైన, వ్యూహాత్మక ప్రాంతంగా పేరొందిన కోకాపేట్‌ భూములకు ఈ-వేలంలో ఊహించని రీతిలో భారీ స్పందన లభించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట్‌లోని గోల్డెన్ మైల్, నియోపోలిస్ లేఅవుట్‌లోని విలువైన భూములకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) నిర్వహించిన ఈ-వేలంలో బిల్డర్లు, డెవలపర్లు పోటీపడి మరీ కోట్లు కుమ్మరించారు.

HMDA విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, ఈ వేలంలో భూముల ధరలు కేటాయించిన అప్‌సెట్ ధర (కనీస మద్దతు ధర) కంటే చాలా రెట్లు ఎక్కువ ధరను పలికాయి.

గోల్డెన్ మైల్ సైట్-1 : ఇక్కడ ఉన్న 0.70 ఎకరాల భూమి ఎకరానికి రూ. 115 కోట్ల చొప్పున అత్యధిక బిడ్ దక్కించుకుంది. HMDA ఈ ప్లాట్‌కు ప్రాథమికంగా ఎకరానికి రూ. 70 కోట్లు అప్‌సెట...