భారతదేశం, నవంబర్ 27 -- తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులున్నాయి. మన్నార్ గల్ఫ్ నుంచి తమిళనాడు తీరంలోని నైరుతి బంగాళాఖాతం వరకు తూర్పు గాలుల్లో ఏర్పడిన ద్రోణి. కొమోరియన్ ప్రాంతం నుంచి తమిళనాడు, కేరళ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు విస్తరించింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఈ ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బులెటిన్ లోని వివరాల ప్రకారం. ఇవాళ (నవంబర్ 27, 2026) నెల్లూరు, కర్నూలు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడతాయి.

అమరావతి వాతావరణ కేంద్రం విడుదల చేసిన వివరాల ప్రకారం. కోస్తా ఆంధ్రప్రదేశ్...