Telangana, ఆగస్టు 14 -- బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఇవాళ్టి ఉదయం రిపోర్ట్ ప్రకారం... ఉత్తర ఏపీ, దక్షిణ ఒడిశా తీరాలకు అనుకుని పశ్చిమ మధ్య, పరిసర ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రాంతం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి.. రాబోయే 24 గంటల్లో మరింత ప్రభావవంతంగా మారే అవకాశం ఉంది. రాబోయే 48 గంటల్లో ఉత్తర కోస్తా ఏపీ, దక్షిణ ఒడిశా మీదుగా కలిదే అవకాశం ఉందని అంచనా వేసింది.

అల్పపీడన ప్రభావంతో. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ(ఆగస్ట్ 14) మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఇక కొత్తగూడెం, భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబాబాద్, మేడ్చల్, ములుగు, నిర్మల్, నిజామాబాద...