Andhrapradesh, ఆగస్టు 28 -- ఒడిశా తీరానికి అనుకుని వాయవ్య బంగాళాఖాతం-ఒడిశా మధ్య అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా వైపు నెమ్మదిగా కదిలే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.

గురువారం(28-08-25) : ఇవాళ అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

పార్వతీపురం మన్యం, కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి మన్యం జిల్లా సీతంపేటలో 7...