భారతదేశం, సెప్టెంబర్ 9 -- ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య సంరక్షణను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సీనియర్ అధికారులను ఉద్యోగుల ఆరోగ్య పథకం కోసం కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని తాజాగా ఆదేశించారు. సచివాలయంలో సీనియర్ ఐఏఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

7.14 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత చికిత్స వ్యవస్థను ఏర్పాటు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ పథకం అమలు చేయడానికి ఇతర రాష్ట్రాల ఆరోగ్య పథకాలు, బీమా కంపెనీల విధివిధానాలను అధ్యయనం చేయాలని, వీలైనంత త్వరగా నివేదిక తయారు చేయాలని సీఎస్ ఆదేశించారు. ఈ పథకానికి ఏటా దాదాపు రూ.1,300 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.

మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతంలో నుంచి కొంత డబ్బును జమ చేస...