Telangana, సెప్టెంబర్ 20 -- కొత్త వాహనాలు కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారా.? అయితే మీరు మరో కొత్త ట్యాక్స్ కట్టేందుకు సిద్ధం కావాల్సిందే.! ప్రస్తుతం ఉన్న వెహికిల్ లైఫ్‌ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, ఇన్సూరెన్స్‌ ప్రీమియం ఇలా అనేక పలు రకాల ట్యాక్సులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే వీటికి తోడుగా మరో ట్యాక్ రాబోతుంది. ఇదే అంశంపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై రోడ్డు భద్రతా సెస్(రోడ్ సెఫ్టీ ట్యాక్స్) విధించాలని రవాణాశాఖ నిర్ణయించింది. ఈ కొత్త ప్రతిపాదనకు సర్కార్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలిసింది. అయితే ఈ ట్యాక్స్ అమల్లోకి రావాలంటే. చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇదే అంశంపై ప్రభుత్వం కసరత్తు షురూ చేసింది. శాసనసభ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందిన తర్వాత. ఈ ట్యాక్స్ ను అమల్లోకి...