Telangana,hyderabad, ఆగస్టు 28 -- రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది. మీసేవా ద్వారా స్వీకరిస్తున్న దరఖాస్తులను పౌరసరఫరాల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. అర్హతలు ఉంటే తక్కువ రోజుల్లోనే మంజూరు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు మంజూరు పత్రాలను కూడా పంపిణీ చేశారు. వీరందరికీ వచ్చే సెప్టెంబర్ నెల నుంచే రేషన్ సరుకులు అందనున్నాయి.

కార్డు లేని అర్హుల‌కు కొత్త కార్డుతోపాటు.. పాత కార్డుల్లో కొత్త స‌భ్యుల చేర్చారు. సెప్టెంబ‌ర్ 1వ తేదీ నుంచి అద‌నంగా 40 ల‌క్ష‌ల మంది ల‌బ్ధిదారులు స‌న్న‌బియ్యం అందుకోనున్నారు. మొత్తంగా 99.97 ల‌క్ష‌ల కుటుంబాలు స‌న్న‌ బియ్యం అందుకోనున్నాయి. అర్హత ఉన్న ప‌త్రి ల‌బ్ధిదారుడికి 6 కేజీల స‌న్న‌బియ్యం ఉచితంగా పంపిణీ చేసే కార్య‌క్ర‌మాన్ని ఈ ఏడాది మార...