భారతదేశం, జనవరి 25 -- టీమిండియా సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ఆర్జే మహ్వాష్ మధ్య బంధం బ్రేకప్ అయిందనే వార్తలు వస్తున్నాయి. వీళ్లు ఇన్ స్టాగ్రామ్ లో ఒకరిని మరొకరు అన్ ఫాలో కావడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో చాహల్ మరో అమ్మాయితో కలిసి కనిపించడం వైరల్ గా మారింది. చాహల్ కొత్త గర్ల్ ఫ్రెండ్ షెపాలీ బగ్గా అనే రూమర్లు బలంగా వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ బ్యూటీ షెఫాలీ బగ్గాతో కలిసి క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ కనిపించడం వైరల్ గా మారింది. శనివారం (జనవరి 24) రాత్రి వీరిద్దరూ ముంబైలో కలిసి కనిపించారు. వీరి కలయికకు గల కారణం ఇంకా తెలియకపోయినా, ఈ వీడియో నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తించింది.

వైరల్ గా మారిన వీడియోలో చాహల్ నల్ల చొక్కా, డెనిమ్ ప్యాంట్లలో కనిపించాడు. షెపాలీ బగ్గా నల్ల దుస్తులలో అందంగా కనిపించింది. వారు విడివిడిగా ఫోటోలకు పోజులిచ్చినప్పటికీ, ఫ...