భారతదేశం, అక్టోబర్ 2 -- ప్రస్తుత ఎండీ, సీఈఓ శశిధర్ జగదీశన్ పదవీకాలం 2026 అక్టోబర్ 26తో ముగుస్తుంది. మరొక విడత పదవిలో కొనసాగేందుకు ఆయన ఆసక్తి చూపకపోవడంతో అక్టోబర్ 26 తర్వాత బ్యాంక్ నుంచి పదవీ విరమణ చేయనున్నారు. బ్యాంకింగ్ నిబంధనల చట్టం 1949లోని సెక్షన్ 35బి కింద 2026 అక్టోబర్ 27 నుంచి మూడేళ్ల కాలపరిమితికి అనూప్ బాగ్చీ నియామకానికి, ఆయన వేతన ప్రతిపాదనలకు ఆర్‌బీఐ అక్టోబర్ 1న ఆమోదం తెలిపినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎక్స్చేంజ్ దాఖలులో వెల్లడించింది. ఆర్‌బీఐ ఆమోదం అనంతరం, అక్టోబర్ 2 నుంచి ఆయనను అదనపు డైరెక్టర్‌గా బ్యాంక్ బోర్డు నియమించింది. వాటాదారుల అనుమతి లభించిన తర్వాత ఈ నియామకం అమల్లోకి వస్తుంది.

బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్లు, వెల్త్ మేనేజ్‌మెంట్, ఇన్సూరెన్స్ రంగాల్లో అనూప్ బాగ్చీకి ముప్పై ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. ఐఐటీ కాన్పూర్ న...