భారతదేశం, మే 21 -- టెక్ ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఖర్చులను తగ్గించుకోవడమే లక్ష్యంగా దిగ్గజ సంస్థ మెటా తాజాగా దాదాపు 8,000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఈ లేఆఫ్స్ (Layoffs) ప్రక్రియలో భాగంగా సింగపూర్‌లో పనిచేస్తున్న గ్యారీ టే అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన ఉద్యోగాన్ని కోల్పోయారు. దాదాపు పదేళ్ల పాటు కంపెనీ ఎదుగుదలలో భాగస్వామిగా ఉన్న తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆయన లింక్డ్‌ఇన్‌లో పంచుకున్నారు.

గ్యారీ టే ఒక సామాన్య ఉద్యోగి కాదు. ఆయన మెటాలో దాదాపు 9 ఏళ్ల 9 నెలల పాటు (3,544 రోజులు) పనిచేశారు. లండన్‌లో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి, ఆ తర్వాత సింగపూర్ ఆఫీస్‌కు మారారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే.. ప్రస్తుతం మెటాలో ఉన్న 99.5% మంది ఉద్యోగుల కంటే ఆయన సీనియర్. ఆసియా-పసిఫిక్ (APAC) విభాగంలో ఆయన కంటే సీనియర్లు ఎవరూ లేరం...