భారతదేశం, మార్చి 17 -- కొత్త అమావాస్య చాలా శక్తివంతమైనదని అంటారు. విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చే ఆఖరి అమావాస్య. ఈ ఫాల్గుణ అమావాస్య లేదా కొత్త అమావాస్య నాడు పాటించాల్సిన నియమాలు ఏంటి, చేయకూడని తప్పులు ఏంటి వంటి వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.

మార్చి 18 అనగా రేపు వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ అమావాస్యని ఫాల్గుణ అమావాస్య లేదా కొత్త అమావాస్య అని అంటారు. తెలుగు సంవత్సరంలో ఇది చివరి అమావాస్య. అమావాస్య తిథి ఉదయం 7:40కి ప్రారంభమవుతుంది. మార్చి 19 ఉగాది నాడు ఉదయం 6:55 వరకు అమావాస్య ఉంటుంది. కాబట్టి ఈ రెండు రోజులు కూడా అమావాస్య గడియలు ఉన్నాయి. కనుక కొన్ని నియమాలను పాటించాలి. అలాగే కొత్త అమావాస్య నాడు కచ్చితంగా కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి.

పూజ గదిని, దేవుడు చిత్రపటాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. సాధారణంగా అమావాస్య తర్వాత పూజ గదిన...