భారతదేశం, అక్టోబర్ 5 -- కడప జిల్లా ప్రొద్దుటూరులో కన్నతల్లిని కొడుకు దారుణంగా హత్య చేశాడు. గొంతు కోసి ఆమె శవాన్ని బయటకు ఈడ్చుకొచ్చాడు. అంతేకాదు తర్వాత వెళ్లి టీవీ చూస్తూ కూర్చున్నాడు. ఈ ఘటన చూసిన స్థానికులు భయందోళనకు గురయ్యారు. పోలీసులు సమాచారం ఇవ్వగా.. ఘటన స్థలానికి వచ్చారు.

ప్రొద్దుటూరులోని శ్రీరామ్‌నగర్‌లో లక్ష్మీదేవి, విజయ్ భాస్కర్ రెడ్డి దంపతులు ఉంటున్నారు. వీరి కుమారుడు యశ్వంత్ రెడ్డి. లక్ష్మీదేవి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తారు. ఉన్నదాంట్లో కొడుకును బాగా చదివించాలనుకున్నారు. ఈ మేరకు చెన్నైకి పంపించి.. బీటెక్ చదివించారు. మూడేళ్ల క్రిత ఇంజినీరింగ్ పూర్తి చేశాడు యశ్వంత్. ఉద్యోగం కోసం వెతుకుతూ హైదరాబాద్‌లో ఉంటున్నాడు.

ఖర్చుల నిమిత్తం ప్రతినెలా.. డబ్బులు అడుగుతూ ఉండేవాడు. ఉద్యోగం కోసం కుమారుడు కష్టపడుతున్నాడు కదా.. అని ...