భారతదేశం, ఏప్రిల్ 2 -- జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో మూడు రోజుల హనుమాన్ చిన్న జయంతి జాతర బుధవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ వేడుకకు సుమారు 3 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. దీనికోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. హనుమాన్ దీక్ష తీసుకున్న భక్తులు కొన్ని రోజుల కిందటి నుంచే ఆలయానికి చేరుకోవడం ప్రారంభించారు, పాదయాత్రగా కూడా కొందరు వస్తున్నారు.

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఇతర జిల్లాల నుండి భారీ సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించుంకుంటున్నారు. క్యూ లైన్లు హనుమాన్ దీక్షా స్వాములతో నిండిపోయాయి. జయంతి సందర్భంగా హనుమాన్ మాల విరమణలు కూడా జరుగుతున్నాయి.

41 రోజులపాటు కఠిన దీక్షలు చేపట్టిన స్వాములు కొండగట్టుకు చేరుకుని.. అంజన్నకు ఇరుముడులు సమర్పిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో ...