భారతదేశం, నవంబర్ 18 -- న్యాయస్థానంలో బాధితుల పక్షాన నిలబడి నిందితులకు శిక్ష పడేలా చేయాల్సిన ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. పెద్దపల్లి జిల్లా ప్రధాన, సెషన్స్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా (టెన్యూర్) పనిచేస్తున్న దొంకెన రవీందర్ (58)... ఆయనకు సహకరించిన ప్రైవేట్ వ్యక్తి రెడ్డిరాజుల రాజయ్యలను కరీంనగర్ ఏసీబీ బృందం బుధవారం (నవంబర్ 18, 2026) అరెస్ట్ చేసింది. ఫిర్యాదుదారుడి నుంచి రూ. 1,50,000 లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా అధికారులు వీరిని పట్టుకున్నారు.

పెద్దపల్లి పట్టణంలోని పబ్లిక్ ప్రాసిక్యూటర్ దొంకెన రవీందర్ నివాసంలో ఈ ట్రాప్ ఆపరేషన్ జరిగింది. ధర్మారం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నంబర్ 12/2023 కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ దశలో ఉంది. ఈ కేసులో నిందితులకు అన...