భారతదేశం, జూన్ 11 -- ఢిల్లీకి చెందిన ఓ అమ్మాయి కేవలం 180 మీటర్ల కోసం ఓలా బైక్ ట్యాక్సీని బుక్ చేసుకుంది. ఈ వార్త సోషల్ సోషల్ మీడియా ప్రపంచంలో వైరల్ అవుతోంది. ఇంత తక్కువ దూరం నడవొచ్చు కదా అని చాలా మంది అనుకుంటారు. కానీ అమ్మాయి ఓలా బుక్ చేయడానికి ఓ కారణం ఉంది. తాజాగా ఆ అమ్మాయి కేవలం 180 మీటర్ల దూరం ప్రయాణించేందుకు ఓలా బైక్ బుక్ చేసుకుంది. ఈ వార్త వింటుంటే ఎవరైనా ఇంత తక్కువ దూరానికి బైక్ ట్యాక్సీ ఎందుకు బుక్ చేసుకుంటారు అని ఆశ్చర్యపోతూ ఉంటారు. దీనికి సమాధానం కుక్కల భయం.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను 'ఘర్ కే కాలేష్' అనే సోషల్ మీడియా(ఎక్స్) పేజీలో షేర్ చేశారు. వ్లాగ్ కెమెరా ధరించిన ఓలా బైక్ ట్యాక్సీ రైడర్ పికప్ లొకేషన్‌కు చేరుకోవడంతో ఈ వీడియో మొదలవుతుంది. అతని కోసం ఓ అమ్మాయి ఎదురుచూస్తోంది. రైడర్ ఓటీపీ కోరగా అమ్మాయి చెబుతుంది.

రైడర్ యాప్‌లో డ్...