భారతదేశం, జూలై 28 -- జ్యోతిష్య శాస్త్రంలో కేతువును మోక్షం, నిర్లిప్తత మరియు ఆధ్యాత్మికతకు కారకుడిగా భావిస్తారు. సాధారణంగా గ్రహాల కదలికల్లో కేతువు సంచారం చాలా నెమ్మదిగా సాగుతుంది. కేతువు తన స్థానాన్ని లేదా నక్షత్రాన్ని మారినప్పుడల్లా దాని ప్రభావం ద్వాదశ రాశులపై స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రస్తుతం కేతు గ్రహం సింహరాశిలో మాఘ నక్షత్రంలో కొలువై ఉంది. జ్యోతిష్య నిబంధనల ప్రకారం మాఘ నక్షత్రానికి అధిపతి స్వయంగా కేతువే. తన సొంత నక్షత్రంలో కేతువు ప్రవేశించడం వల్ల అనేక రాశుల జీవితాల్లో ఊహించని పరిణామాలు, సానుకూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

హిందూ పంచాంగం ప్రకారంయయయ ఈ అంతుచిక్కని కేతువు తన సొంత నక్షత్రమైన మఖ నక్షత్రంలో వచ్చే డిసెంబర్ నెల వరకు కొనసాగుతాడు. కేతువు ఈ సంచారం కారణంగా ముఖ్యంగా ఆరు రాశుల వారికి అత్యంత ప్రయోజనకరమైన, శుభ ఫలితాలు అందుతాయని ప్రమ...