భారతదేశం, ఫిబ్రవరి 1 -- రీజనల్ రింగ్ రోడ్ , హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ II, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌తోపాటుగా మరిన్ని ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధుల కోసం తెలంగాణ ఎదురుచూసింది. కానీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఇవి ఏవీ ప్రస్తావించలేదు. మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, సామాజిక రంగాలలోని ఈ ప్రాజెక్టుల కోసం తెలంగాణ రూ. 1.5 లక్షల కోట్లకు పైగా కోరింది. కానీ ఎలాంటి కేటాయింపులూ జరగలేదు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం, అమరావతికి సంబంధింతి కొన్ని కేటాయింపులు జరిగాయి. దీంతో సహజంగానే పోలిక మెుదలైంది.

బడ్జెట్ కేటాయింపులలో తెలంగాణకు అన్యాయం జరిగిందని రాష్ట్రం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర బడ్జెట్ 2026-27 భారతదేశం అంతటా ఏడు హై-స్పీడ్ రైలు కా...