భారతదేశం, జూలై 31 -- కేంద్ర మంత్రిమండలి దేశాభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతులు, యువత, క్రీడాకారులు, ఇంధన రంగానికి లబ్ధి చేకూర్చే బృహత్తర పథకాలకు పచ్చజెండా ఊపారు. ఈ నిర్ణయాల వివరాలను కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.

రైతులకు సాగు ఖర్చుల కోసం నేరుగా ఆర్థిక సహాయం అందించే 'ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' (పీఎం-కిసాన్) పథకాన్ని 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించారు. ఈ ఐదేళ్ల కాలానికి గాను రూ. 3,15,614 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించారు.

2019 ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 6,000 చొప్పున ఆర్థిక సాయం అందుతోంది. ఈ మొత్తాన్ని రూ. 2,000 చొప్పున మూడు సమాన విడతల్లో నేరుగా లబ్ధిదార...