Telagana,hyderabad, ఆగస్టు 19 -- యూరియా కొరత రాష్ట్రంలోని అన్నదాతలను కలవరపెడుతోంది. పంపిణీ కేంద్రాల వద్ద రైతులు బారులు తీరుతున్నారు. పీఏసీఎస్‌లకు(ప్రాథమిక వ్యవసాయ సహకర సంఘం)యూరియా లోడ్‌ వస్తుందనే సమాచారం అందింతే చాలు. అన్నదాతలు వేకువ నుంచే బారులు తీరుతున్నారు. దీంతో బస్తా యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. అయితే ఇదే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. తక్షణమే రాష్ట్రానికి యూరియాను సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరారు.

తెలంగాణ రైతాంగానికి అవసరం మేరకు యూరియాను తక్షణం సరఫరా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేటాయించిన మేరకు రాష్ట్రానికి యూరియా సరఫరా చేయకపోవడంతో తలెత్తుతున్న సమస్యలను పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులకు వివరించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.

ప్రస్తుత ఖరీఫ్ సీజన్...