భారతదేశం, సెప్టెంబర్ 30 -- చాలా మంది ఎంత కష్టపడి పని చేసినా కూడా, అనుకున్న వాటిని విజయవంతంగా పూర్తి చేయలేరు. పదోన్నతి, ప్రమోషన్ లేదా జీతం పెంపు లభించక చాలామంది సతమతమవుతూ ఉంటారు. మీరు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారా? దీనివలన నిరాశకు గురవుతున్నారా?

జ్యోతిష్యంలో కెరీర్, ఉద్యోగానికి సంబంధించిన విషయాలను జాతకంలో దశమ భావం లేదా కర్మ భావం ద్వారా పరిశీలిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని గ్రహస్థితులు కెరీర్‌కి, ఉద్యోగంలో సమస్యలకు కారణం అవుతాయని చెప్పొచ్చు. సానుకూలత పెరగడానికి, కెరీర్, ఉద్యోగంలో మంచి ఫలితాలు రావడానికి ఈ జ్యోతిష్య పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

శని దేవుణ్ణి కర్మ ఫలాలను ప్రసాదించే దేవుడిగా భావిస్తారు. జాతకంలో శని స్థానం ఉద్యోగం, కష్టపడి పని చేయడం, వృత్తికి సంబంధించిన అంశాలతో ముడిపడి ...