భారతదేశం, సెప్టెంబర్ 23 -- కాకినాడ జిల్లాలోని యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో మత్స్యకారులు రొడ్డె్క్కారు. తీర ప్రాంతాల్లోని ఫార్మా కంపెనీల నుంచి రసాయన వ్యర్థాల కారణంగా మత్స్య సంపద నశించి జీవనోపాధి కోల్పోతున్నామంటూ.. ఆందోళనకు దిగారు. అధిక సంఖ్యలో మత్స్యకారులు రోడ్డును మూసివేసి బైఠాయించారు. వ్యర్థాలను సముద్రంలోకి విడిచిపెట్టకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సముద్రంలోకి రసాయన వ్యర్థాలను విడుదల చేయకండా ప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఉప్పాడ చుట్టుపక్కల గ్రామాల మత్స్యకారులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. తీర ప్రాంతాలలోని అన్ని గ్రామాల నుంచి మత్స్యకారులు వచ్చి ఏకతాటిపై ఉప్పాడ సెంటర్ వద్ద రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు. ప్రధాన సెంటర్‌లో ఉన్న భవనాలు ఎక్కి.. నిరసన తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ.1.50లక్షల పరిహా...