భారతదేశం, ఆగస్టు 9 -- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ కాలంలో చాలా డిమాండ్ ఉంది. ఏఐ మీద పరిజ్ఞానం ఉన్నవారికి కోట్లలో జీతాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో ఏఐ నిపుణులదే హవా. మీకు దాని గురించి లోతైన జ్ఞానం ఉంటేనే మీరు ఏఐ రంగంలో ఉద్యోగం పొందుతారు. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మాస్టర్స్ లేదా బ్యాచిలర్స్ చేయాలి . కెనడాతోపాటుగా వివిధ దేశాలలో ఏఐ డిగ్రీ చదవొచ్చు. టెక్ పరిశ్రమలో మీరు కింగ్‌లాగా కెరీర్ లీడ్ చేయవచ్చు. కెనడాలో ఉన్న బెస్ట్ యూనివర్సిటీలను చూద్దాం..

కెనడాలోని టొరంటో విశ్వవిద్యాలయం ఏఐ పరిశోధన, విద్య కోసం ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థలలో ఒకటిగా ఉంది. ఇక్కడి కంప్యూటర్ సైన్స్ విభాగంలో పరిశోధకులు, ఏఐ వ్యవస్థకు ప్రసిద్ధి చెందింది. ఏఐలో స్పెషలైజేషన్‌తో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ అప్లైడ్ కంప్యూటింగ్ చేయడానికి అవకాశం పొందుతారు. ...