భారతదేశం, నవంబర్ 8 -- తెలుగులో హీరోయిన్‌గా ధన్య బాలకృష్ణన్ మంచి క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా ధన్య బాలకృష్ణన్ హీరోయిన్‌గా చేసిన డిఫరెంట్ లవ్ స్టోరీ మూవీ కృష్ణ లీల. తిరిగొచ్చిన కాలం అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమాలో హీరోగా దేవన్ నటించడంతోపాటు స్వీయ దర్శకత్వం వహించారు.

ధన్య బాలకృష్ణన్, దేవన్‌తోపాటు బబ్లూ పృథ్వీ, వినోద్ కుమార్, రజిత, సరయు తదితరులు కీలక పాత్రలు పోషించారు. బేబీ వైష్ణవి సమర్పణలలో మహాసేన్ విజువల్స్ పతాకంపై జ్యోత్స్న జి కృష్ణ లీల సినిమాను నిర్మించారు. నవంబర్ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో నేటి కృష్ణ లీల రివ్యూలో చూద్దాం.

యోగా గురువుగా విహారి (దేవన్) అమెరికాలో చాలా పాపులర్. తన చెల్లి పెళ్లి కోసం దేవన్ భారత్‌కు వస్తాడు. హోంమంత్రి (వినోద్ కుమార్) కూతురు బృంద (ధన్య బాలకృష్ణన్)ను చూసిన విహారి ప్రేమిస్తాడు. అబ్బాయిలంటే ఏమాత్రం నచ్...