భారతదేశం, ఆగస్టు 15 -- విష్ణుమూర్తి ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన పవిత్ర దినమే కృష్ణ జన్మాష్టమి. ఈ పండుగను భక్తులు దేశవ్యాప్తంగా ఎంతో భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఉపవాసాలు ఉండి, ప్రత్యేక పూజలు చేసి భక్తులు శ్రీకృష్ణుడి ఆశీర్వాదం పొందుతారు. ఈ ఏడాది కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కృష్ణ జన్మాష్టమి పండుగను రెండు రోజులు జరుపుకోనున్నారు. ఈ విశేషాలు, పూజావిధానాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ద్రుక్ పంచాంగం ప్రకారం, ఈ సంవత్సరం కృష్ణ జన్మాష్టమి ఆగస్టు 15, 16 తేదీల్లో జరుపుకుంటారు. అష్టమి తిథి ఆగస్టు 15 రాత్రి 11:49 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 16 రాత్రి 9:34 గంటలకు ముగుస్తుంది. ఈ ఏడాది శ్రీకృష్ణుడి 5252వ జయంతి.

సాధారణంగా జన్మాష్టమిని ఒక రోజు జరుపుకోవడం ఆనవాయితీ. కానీ, ఈ ఏడాది అష్టమి తిథి ఆగస్టు 15 అర్ధరాత్రికి దగ్గరగా ప్రారంభం క...