Andhrapradesh, సెప్టెంబర్ 24 -- ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో బేసిన్ లో నీటిమట్టం కూడా క్రమంగా పెరుగుతోంది. ఇవాళ్టి ఉదయం వివరాల ప్రకారం ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.29 క్యూసెక్కులుగా ఉంది. 4.50 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉంది.

అత్యవసర సహాయక చర్యల కోసం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఘాట్లలో 5 ఎస్డీఆర్ఎఫ్, కోనసీమ జిల్లా అమలాపురంలో 1SDRF, తిరుమలలో 2 ఎన్డీఆర్ఎప్ బృందాలు ఉంచినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ఆయా నదీపరీవాహక ప్రాంత, లోతట్టు గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించింది.

అవసరమైతే ప్రభావిత లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఏపీ విపత్తు నిర్వహణ సం...