కూరగాయలపై బూజు, కుళ్లిపోయిన మాంసం, అపరిశుభ్రమైన వంటగది.. 'లగ్జరీ' హోటళ్లలో దారుణం! ప్రజల ఆరోగ్యంతో చెలగాటం
భారతదేశం, ఆగస్టు 8 -- బెంగళూరు నగరంలోని పలు ప్రముఖ లగ్జరీ హోటళ్లు.. ఆహార భద్రత ప్రమాణాలను పూర్తిగా గాలికి వదిలేసి, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి! ఈ నేపథ్యంలోనే త్రీ-స్టార్, ఫైవ్-స్టార్ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
కూరగాయలపై బూజు పట్టడం, శాకాహార, మాంసాహార పదార్థాలను సరిగ్గా వేరు చేయకపోవడం, అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో వంటకాలు నిల్వ చేయడం వంటి తీవ్ర ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. నిబంధనలను ఉల్లంఘించిన హోటళ్ల నుంచి కుళ్లిపోయిన మాంసం, చికెన్, చేపలు, ఎక్స్‌పైరీ అయిన బేకరీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
ఫుడ్‌సేఫ్టీ నిబంధనల ప్రకారం లేబులింగ్ లేకపోవడం, ఫుడ్ ప్రొడక్ట్స్‌పై తప్పుడు లేబుల్స్ వేయడం, గడువు ముగిసిన ఆహార పదార్ధాలను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.