భారతదేశం, ఫిబ్రవరి 17 -- హీరోలుగా మారిన నేషనల్ లెవెల్‌లో స్టార్‌డమ్, క్రేజ్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. ఇప్పటికీ స్టార్ కిడ్స్, బిగ్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న హీరోలు మంచి క్రేజ్ కోసం, సూపర్ హిట్ కోసం ఆరాటపడుతున్నారు. అయితే, ఎన్నో ఏళ్లకు రాని విపరీతమైన క్రేజ్ ఒక్క కూతురు పుట్టగానే వచ్చింది ఈ హీరోలకు.

అవును, కో ఇన్సిడెన్స్ లేదా హార్డ్ వర్క్‌తో వచ్చిన అదృష్టమో కానీ ఈ హీరోలకు కూతురు పుట్టాక తలరాత మారిపోయింది. కుమార్తె పుట్టిన తర్వాత చేసిన సినిమాకు రూ. 1000 కోట్ల కలెక్షన్స్ రావడంతోపాటు నేషనల్ వైడ్‌గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. మరి ఆ హీరోలు ఎవరో ఓ లుక్కేద్దాం.

కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా యశ్ ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో తెలిసిందే. కన్నడలో హీరోగా అలరించిన యశ్ ఒక్క కేజీఎఫ్ సినిమాతో తన గురించి అందరూ మాట్లాడుకునేలా చేశాడు. అలాగే,ఈ సినిమా వెయ...