Telangana,hyderabad, ఆగస్టు 18 -- హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో దారుణం చోటు చేసుకుంది. సంగీత్‌నగర్‌లో ఇంట్లో ఒంటరిగా ఉన్న పదేళ్ల బాలికను అత్యంత దారుణంగా హత్య చేశారు. తండ్రి ఇంటి తలుపులు తీసి గమనించగా. బెడ్‌రూమ్‌లో పొట్టపై కత్తి పోట్లతో బాలిక విగతజీవిగా పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా. అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం. కుమారుడు, కుమార్తెతో కలిసి దంపతులు సంగీత్ నగర్ లో నివాసముంటున్నారు. రెండేళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. తండ్రి బైక్‌ మెకానిక్‌ కాగా. తల్లి ల్యాబ్‌ టెక్నీషియన్‌ గా పని చేస్తోంది. 10 ఏళ్ల బాలిక కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతోంది.

ఇవాళ ఉదయం తల్లిదండ్రులు కుమారుడిని స్కూల్‌కు పంపారు. కుమార్తెకు సెలవు కావటంతో ఇంట్లోనే ఉంది. అయితే ఇద్దరు తల్లిదండ్రులు విధులకు వెళ్లారు. ...