Telangana,hyderabad, ఆగస్టు 18 -- బహుజనులు సమాజంలో ఎదగాలన్నా, నిలదొక్కుకోవాలన్నా చదువు ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లల కోసం రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

ఇవాళ రవీంద్రభారతిలో శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 375 వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆ మహనీయునికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సచివాలయం ఎదురుగా ట్యాంక్‌బండ్‌ పైన పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సర్దార్ పాపన్న గౌడ్ నిర్మించిన ఖిలాషాపూర్ కోటను చారిత్రక క్షేత్రంగా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

Published by HT Digital Conte...