భారతదేశం, జూన్ 26 -- ండ్రిని ఆస్తి విషయంలో కూతుళ్లు అవమానించారు. ఈ బాధను తట్టుకోలేని తండ్రి ఏకంగా నాలుగు కోట్ల రూపాయలను ఆలయానికి విరాళంగా ఇచ్చేశాడు. ఇప్పుడు ఆ కుమార్తెలు ఆ ఆస్తిని పొందడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటన తమిళనాడులోని తిరువణ్ణామలైలో జరిగింది. ఆయన విరాళం తర్వాత కూతుళ్లు ఇప్పుడు ఆ ఆస్తులను తిరిగి పొందేందుకు నానా తంటాలు పడుతున్నారు.

రిటైర్డ్ ఆర్మీ అధికారి అయిన ఎస్ విజయన్ తన కూతుళ్ల అవమానంతో ఎంతో బాధపడి ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 24న విరాళాల పెట్టెను తెరిచినప్పుడు అందులో నాణేలు, నోట్లతో పాటు రెండు ఒరిజినల్ ప్రాపర్టీ డాక్యుమెంట్లు లభించాయని అరుల్మిగు రేణుగంబల్ అమ్మవారి ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఒక ఆస్తి విలువ రూ.3 కోట్లు కాగా, మరొకటి రూ.కోటి ఉంటుందని చెప్పారు. ఈ రెండూ కలిపి రూ.4 కోట్ల ఆస్తి అవుతుంది. దీనిని తాను స్వచ్ఛ...