Andhrapradesh,delhi, ఆగస్టు 18 -- కేంద్ర ఉపరితల రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. రహదారి భద్రత, ట్రాఫిక్ రద్దీ నిర్వహణ, లాజిస్టిక్స్, పాసింజర్ కారిడార్ల ఇంటిగ్రేషన్ ఆవశ్యకతపై చర్చించారు. ప్రతిపాదిత రహదారులు, ట్రాఫిక్ నియంత్రణకు కొత్త రోడ్లు మంజూరు చేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు.

కుప్పం-బెంగళూరు-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ సహా ప్రధాన రహదారుల విస్తరణలు, అర్బన్ మొబిలిటీ ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని కేంద్రమంత్రి గడ్కరీని లోకేశ్ కోరారు. కుప్పం-హోసూరు-బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టుకు త్వరితగతిన ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయాభివృద్ధికి ఇది గేమ్ ఛేంజర్ అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

బెంగళూరు-చెన్నై ఎక్స్ ప్రెస్ వే (ఎన్ ఈ-7)కు సత్వర ఆమోదం, ...