భారతదేశం, ఆగస్టు 14 -- న్యూఢిల్లీ, ఆగస్టు 14, 2025: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువజంటలకు ఢిల్లీ హైకోర్టు భరోసా ఇచ్చింది. ఇద్దరు యువతీ యువకులకు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోవడానికి, కలిసి ప్రశాంతంగా జీవించడానికి పూర్తి స్వేచ్ఛ ఉందని కోర్టు స్పష్టం చేసింది. కుటుంబ సభ్యుల వ్యతిరేకత ఈ స్వేచ్ఛను అడ్డుకోలేదని కోర్టు తేల్చిచెప్పింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవం, జీవించే హక్కులకు పూర్తి రక్షణ ఉంటుందని హైకోర్టు పేర్కొంది.

ఈ కేసులో, ఒక యువ జంట తమ కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు ఎదురవుతాయని కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ నరులా, యువజంటకు పోలీసు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. సుప్రీం కోర్టు కూడా గతంలో ఇలాంటి కేసుల్లో ఇదే సూత్రాన్ని సమర్థించిందని, బెదిరింపులు లేదా బలవంతం నుంచి ప్రేమ వ...