భారతదేశం, జూన్ 15 -- ఇప్పటికీ ఊర్లలో చాలా విషయాలు నమ్ముతుంటారు. అర్ధరాత్రి కుక్క మెురగడం, లేదా నేలను పదే తవ్వడంలాంటి విషయాలను చూసినప్పుడు పెద్దలు ఏదో ఒక విషయం చెబుతుంటారు. సంప్రదాయాలు, నమ్మకాలలో జంతువులకు, పక్షులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా అర్ధరాత్రి వేళల్లో కుక్కలు గుంపుగా చేరి వింతగా మొరగడం గమనించి ఉండవచ్చు. ఇది కేవలం యాదృచ్ఛికమేనా లేక దీని వెనుక ఏదైనా రహస్యం ఉందా అని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. మన పెద్దల ప్రకారం.. రాత్రిపూట కుక్కలు మెురగడం అశుభం, అది ప్రతికూల శక్తులకు సంకేతం అంటారు. దెయ్యాలు, భూతాల వంటి కనిపించని శక్తులను కుక్కలు చూడగలవా అనే విషయంలో చాలా మంది గందరగోళానికి గురవుతారు. దీని గురించి చూద్దాం..

మనుషుల కంటే కుక్కలకు వాసన పసిగట్టే, గ్రహించే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రజలు ఈ శాస్త్రీయ వాస్తవాన్ని తమ నమ్మకాలతో ముడి...