భారతదేశం, డిసెంబర్ 22 -- టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన మార్క్ 'రౌడీ' ఇమేజ్‌ను మళ్లీ వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. 'రాజా వారు రాణి గారు' ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న విజయ్ కొత్త సినిమా రౌడీ జనార్ధన టైటిల్ గ్లింప్స్‌ను ఇవాళ సోమవారం (డిసెంబర్ 22) సాయంత్రం చిత్ర బృందం విడుదల చేసింది.

పవర్‌ఫుల్ టైటిల్‌‌తో వచ్చిన రౌడీ జనార్ధన టైటిల్ గ్లింప్స్ అదిరిపోయింది. ఈ గ్లింప్స్‌లో విజయ్ దేవరకొండ లుక్ చూసి అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. చింపిరి జుట్టు, దట్టమైన మీస కట్టుతో, ఒంటి నిండా రక్తపు మరకలతో విజయ్ గుర్తుపట్టలేనంతగా కనిపించాడు.

"బండెడు అన్నం తిని కుండెడు రక్తం తాగే రాచ్చసుడి గురించి ఎప్పుడైనా విన్నావా. నేను చూశాను. కొమ్ములతో ఆడి కథను ఆడే రాసుకున్నాడు. కన్నీళ్లను ఒంటికి నెత్తుటిలా పూసుకున్నాడు. సావు కళ్లముందుకు వచ్చి నిలబడ...