భారతదేశం, సెప్టెంబర్ 22 -- ఆంధ్రప్రదేశ్ శాసనమండలి పలు కీలక బిల్లలకు సోమవారం ఆమోదం తెలిపింది. మోటర్ వెహికల్ టాక్సేషన్ సవరణ బిల్లు-2025కు శాసన మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ సవరణ బిల్లు 2025కు ఆమోదం, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కు 65 ఏళ్ల వయోపరిమితిని తొలగించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ సవరణ బిల్లులోని రెండు పదాలను తొలగించిన తర్వాత ఆమోదం దొరికింది. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ సవరణ బిల్లు-2025కు మండలి ఆమోదం లభించింది.

రోజువారి పనిగంటలు 8 నుంచి 10 గంటలకు పెంచడం, విశ్రాంతి విరామంపై చట్ట సవరణ బిల్లుకు శాసనమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బిల్లుపై చర్చ జరిగింది. సేఫ్టీ, మహిళలకు నైట్ డ్యూటీ అమలు చేసేలా చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. రాత్రి 8:30 గంటల నుంచి ఉదయం ఆరు గంటల ...