భారతదేశం, జూలై 28 -- సాధారణంగా వచ్చే క్యాన్సర్లలో కిడ్నీ క్యాన్సర్ ఒకటి. చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. చివరి దశలో ఆసుపత్రులు చుట్టూ తిరుగుతారు. కిడ్నీ క్యాన్సర్‌కు సంబంధించిన విషయాలను డాక్టర్ ఆర్. దినేశ్ రెడ్డి, అసోసియేట్ కన్సల్టెంట్ - సర్జికల్ ఆంకాలజీ & రోబోటిక్ సర్జరీ, మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.. HT Teluguతో పంచుకున్నారు.

కిడ్నీ క్యాన్సర్‌లలో దాదాపు 90 శాతం కేసులు రీనల్ సెల్ కార్సినోమా (RCC) అనే రకానికి చెందుతాయి. ఇది కిడ్నీలోని చిన్న చిన్న ఫిల్టర్లను ఏర్పరిచే గొట్టాల లోపలి లైనింగ్‌లో మొదలవుతుంది. ఈ ఫిల్టర్లు మన రక్తాన్ని శుభ్రపరచి, వ్యర్థ పదార్థాలను మూత్ర రూపంలో బయటకు పంపుతాయి. ఈ క్యాన్సర్ ఇతర ఆరోగ్యపరీక్షల సమయంలో ఎక్కువగా బయటపడుతోంది. అందుకే ముందుగానే గుర్తించడం చాలా కీలకం.

మహిళల కన్నా పురుషుల్లో ఆర...