Hyderabad, ఆగస్టు 25 -- విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన కింగ్డమ్ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. రూ.130 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కి.. బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.80 కోట్లే వసూలు చేసిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అన్న ఆసక్తి నెలకొంది.

విజయ్ దేవరకొండకు మరోసారి నిరాశనే మిగిల్చిన కింగ్డమ్ మూవీ ఈ బుధవారం (ఆగస్టు 27) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అదే రోజు వినాయక చవితి ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ విషయాన్ని సోమవారం (ఆగస్టు 25) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"గోల్డ్, బ్లడ్, ఫైర్ తో కూడిన కింగ్డమ్ లో.. ఓ కొత్త రాజు పుట్టుకొచ్చాడు" అనే క్యాప్షన్ తో నెట్‌ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. మ...