భారతదేశం, జూలై 21 -- రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిళ్లు అంటే ఇండియాలో క్రేజ్ ఎక్కువ. ఇప్పుడు కంపెనీ రాబోయే రోజుల్లో అనేక కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ ఇటీవల తన పాత బైకుల్లో కొన్నింటిని అప్‌డేట్ చేసింది. ఇప్పుడు కొత్త లాంచ్‌లపై పూర్తి దృష్టి సారించింది. రాబోయే కాలంలో కంపెనీ విడుదల చేయబోయే బైక్స్ గురించి తెలుసుకుందాం.

2026 నాటికి మార్కెట్లోకి విడుదల కానున్న 450సీసీ గెరిల్లా బైక్ కేఫ్ రేసర్ వెర్షన్ ను కంపెనీ సిద్ధం చేస్తోంది. ఈ కొత్త బైక్ ట్రయంఫ్ రాబోయే థ్రక్స్టన్ 400కు పోటీ ఇవ్వగలదు. మెటియోర్ 350, బుల్లెట్ 350 వంటి పాపులర్ మోడళ్లు చిన్న డిజైన్ మార్పులు, కొత్త రంగులను పొందే అవకాశం ఉంది. అయితే ఈ బైక్ పవర్ట్రెయిన్లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు.

మరోవైపు 650సీసీ సెగ్మెంట్లో కొత్త బైక్‌ను రూపొందించే పనిలో ఉంది. ...