Telangana,hyderabad, సెప్టెంబర్ 11 -- హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో దారుణం వెలుగు చూసింది. స్వాన్‌లేక్ గేటెడ్‌ కమ్యూనిటీలో నివాసం ఉంటున్న 50 ఏళ్ల మహిళను దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. కాళ్లు, చేతులు కట్టేసి. కత్తితో గొంతు కోశారు. కుక్కర్‌తో కొట్టి చంపేశారు. ఇంట్లో ఉన్న నగదును, బంగారం దోచుకెళ్లారు.

కూకట్ పల్లి పోలీసుల వివరాల ప్రకారం. బుధవారం సాయంత్రం 50 ఏళ్ల మహిళ హత్యకు గురైందని సమాచారం అందింది. ఇన్ స్పెక్టర్ తో కూడిన దర్యాప్తు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని మహిళ కత్తిపోటు గాయాలతో చనిపోయినట్లు గుర్తించారు. జార్ఖండ్ కు చెందిన ఓ వ్యక్తితో పాటు మరోకరి పాత్రపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. హత్య చేసిన తర్వాత. ఇంట్లో నుంచి వెళ్లిపోతున్న నిందితుల దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

"ఇంటి సహాయకుడితో పాటు మరోక వ్యక్తి తిరుగుతున్న వీడియో స...