Telangana,hyderabad, సెప్టెంబర్ 25 -- కాళేశ్వరం కేసులో జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తనపై చర్యలు తీసుకోవద్దంటూ సీనియర్ ఐఎస్ఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారించిన న్యాయస్థానం. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలని కోరుతూ సబర్వాల్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. నివేదిక ఆధారంగా ఎటువంటి ప్రతికూల చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభుత్వ హయాంలో సబర్వాల్ ముఖ్యమంత్రి క...