Telangana,hyderabad, ఆగస్టు 21 -- కాళేశ్వరంపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్‌ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీశ్ రావ్ హైకోర్టులో వేర్వురుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ఇవాళ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు.

కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఉందని న్యాయవాదులు వాదించారు. కేసీఆర్ కు నోటీసు ఇవ్వకుండా ఆయనకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చారని చెప్పారు. మరోవైపు ఈ కేసులో సాక్షిగా విచారణకు పిలిచి రిపోర్ట్‌ ఇవ్వలేదని హరీష్‌ తరఫు లాయర్‌ వాదించారు. నివేదికలో అంశాలు వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా ఉన్నాయని.. లేఖ రాసినా ఇంతవరకు రిపోర్ట్‌ ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. స్వయంగా ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్‌ పెట్టి నివేదికను బయట...