భారతదేశం, జూలై 21 -- దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. వచ్చే ఆగస్టు 2026 నుంచి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో మంగళవారం వెల్లడించింది. కంపెనీ తన ఆల్‌మోడల్స్ పోర్ట్‌ఫోలియోపై గరిష్టంగా రూ.30,000 వరకు ధరలను పెంచాలని నిర్ణయించింది.

వాహనాల విడిభాగాల తయారీ వ్యయం రోజురోజుకూ పెరుగుతోందని, ఆ భారాన్ని తట్టుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే మారుతీ సుజుకీ షేర్లు బిఎస్‌ఈ (BSE)లో 0.6 శాతం లాభపడి రూ.13,597 వద్ద ముగిశాయి.

"నిరంతరం పెరుగుతున్న ఇన్ పుట్ కాస్ట్స్ కారణంగానే విధిలేక ధరలు పెంచాల్సి వస్తోంది. ఆగస్టు 2026 నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయి" అని మారుతీ సుజుకీ తమ ప్రకటనలో స్పష్టం చేసింది.

గడిచిన కొన్ని నెలలుగా ఉత్పత్తి ఖర్చులను తగ...