భారతదేశం, నవంబర్ 16 -- ఈరోజు చాలా విశేషమైన కార్తీక సోమవారం. కోటి సోమవారం కూడా ఈరోజు కలిసి రావడం జరిగింది. కార్తీక మాసంలో సోమవారానికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే కోటి సోమవారం కూడా ఈరోజు కలిసి రావడంతో ఈ రోజును సద్వినియోగం చేసుకుంటే సమస్యల నుంచి బయటపడవచ్చు.

ఈ నెలలో పరమేశ్వరుడికి అత్యంత భక్తితో పూజలు చేస్తారు. కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండడం, శివాలయాలకు వెళ్లడం, దీపారాధన చేయడం, శివనామస్మరణ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, కుటుంబ ఇబ్బందుల నుంచి కూడా బయటపడడానికి వీలవుతుంది.

ఈరోజు కార్తీక సోమవారం, కోటి సోమవారం వేళ సాయంత్రం 6 గంటల తర్వాత ఈ పరిహారాలను పాటిస్తే మంచి మార్పులను చూడొచ్చు. సాయంత్రం 6 గంటల తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో శివుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. ...