భారతదేశం, నవంబర్ 19 -- హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కార్తీక మాసంలో శివకేశవులను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. కార్తీక మాసం వచ్చిందంటే చాలు, ప్రతి ఇంట్లో తెల్లవారుజామున నుంచే దీపాలు వెలుగుతూ ఉంటాయి. తెల్లవారుజామున నదీ స్నానం చేయడం, శివాలయాలకు వెళ్లడం, తులసి కోట దగ్గర దీపారాధన చేయడం.. ఇలా వివిధ రకాల పద్ధతులను చాలా మంది అనుసరిస్తూ ఉంటారు.

కార్తీక మాసంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది 365 వత్తులతో దీపం. కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి కూడా ఎంతో విశిష్టత ఉంది. చాలా మంది ఆ రోజు 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల ఏడాదిలో ఏ ఒక్కరోజు దీపారాధన చేయకపోయినా, ఏడాది అంతా దీపారాధన చేసిన ఫలితాన్ని పొందడానికి వీలవుతుందని నమ్ముతారు. ఈ దీపాన్ని కార్తీక మాసంలో ఏ రోజు వెలిగిస్తే మంచిది? ఏ నూ...