భారతదేశం, నవంబర్ 10 -- హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ నెలలో శివ కేశవులకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. శివకేశవులకు ప్రీతికరమైన నెలగా కార్తీక మాసాన్ని భావిస్తారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివుడిని ఆరాధిస్తారు. తెల్లవారుజామున నిద్రలేచి పవిత్ర స్నానం చేసి, శివలింగానికి అభిషేకాలు చేస్తారు. అలాగే దీపాలను కూడా వెలిగిస్తారు.

కార్తీక మాసంలో శివుడిని భక్తితో ఆరాధించడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆధ్యాత్మిక చైతన్యం లభిస్తుంది. కార్తీక మాసంలో శివుడికి ఎంతో ఇష్టమైన ఈ ఎనిమిది పూజా ద్రవ్యాలను పూజ చేసేటప్పుడు సమర్పించడం మంచిది. అలాగే ఈ మంత్రాలన్నింటినీ కూడా పఠించండి. శివుడికి ఎంతో ఇష్టమైన ఈ ఎనిమిదింటినీ కార్తీక మాసంలో తప్పకుండా సమర్పించండి.

శివుడికి మారేడు దళాలు అంటే ఎంతో ఇష్టం. మూడు...