భారతదేశం, నవంబర్ 10 -- హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కార్తీక మాసంలో శివకేశవులను పూజిస్తారు. కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. తులసి కోట దగ్గర, దేవుడి మందిరంలో, దేవాలయాల్లో దీపాలను వెలిగిస్తూ ఉంటారు. అలాగే ఆకాశ దీపాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అసలు ఆకాశ దీపం అంటే ఏంటి? కార్తీక మాసంలో ఎందుకు ఆకాశ దీపాన్ని వెలిగించాలి? ఆకాశ దీపం వెలిగించడం వెనుక ఉన్న పురాణ విశేషాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

కార్తీక మాసంలో ఎత్తైన ప్రదేశంలో లేదా పొడవైన కర్రకు దీపాన్ని వేలాడదీస్తారు. ఆ దీపాన్ని వెలిగిస్తారు. సాధారణంగా ఈ దీపాన్ని సాయంత్రం పూట వెలిగించడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంటి ప్రాంగణంలో, ఆలయ ధ్వజస్తంభం సమీపంలో, ఎత్తైన ప్రదేశాల్లో ఈ ఆకాశ దీపాలను ఏర్పాటు చేయ...